12-06-2025 12:00:00 AM
- సంక్షేమ అధికారి ఆడెపు భాస్కర్
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 11 ( విజయక్రాంతి): బాల కార్మిక వ్యవస్థను సమిష్టిగా నిర్మూలించాల్సిన అవసరం ఉన్నదని జిల్లా సంక్షేమ అధికారి డాక్టర్ ఆడెపు భాస్క ర్ పేర్కొన్నారు. ఈనెల 12న నిర్వహించాల్సి న ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని కలెక్టరేట్‌లోని జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో అనుబంధ శాఖలు, సూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతి నిధులతో బుధవారం సంయుక్త సమావేశా న్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా సంక్షేమ అధికారి భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అనుబంధ శాఖలతో కలుపుకొని స్వచ్ఛంద సంస్థల సహకారంతో జిల్లావ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాన్ని వారం రోజులపాటు నిర్వహించాలని నిరంతరం పర్యవేక్షించాలని డిసిపిఓ మహేష్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బాల రక్ష భవన్ సిబ్బంది, చైల్ హెల్ప్ లైన్ కోఆర్డినేటర్ బాల ప్రవీణ్ కుమా ర్, సూర్ స్వచ్ఛంద సంస్థ డిస్టిక్ కోఆర్డినేటర్ బండి సంతోష్ కుమార్, డిహెచ్‌ఈ డబ్ల్యు మిషన్ కోఆర్డినేటర్ శారద తదితరులు పాల్గొన్నారు.