calender_icon.png 2 July, 2025 | 12:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18 కేజీల నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

11-06-2025 11:57:32 PM

ఒకరి అరెస్టు: ఎస్సై కిరణ్

బెల్లంపల్లి అర్బన్, జూన్ 11: తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయపల్లి గ్రామం లో నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకుని, ఒకరిని అరెస్టు చేశారు. తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్  కథనం ప్రకారం.. మహారాష్ట్ర గోండు పిప్పిరి నుండి నకిలీ పత్తి విత్తనాలను తీసుకోవస్తుండగా బోయపల్లె గ్రామ సమీపంలో మాసాడి రవీందర్ పట్టుబడ్డారు.

అతని దగ్గర 18 కేజీల నకిలీ పత్తి విత్తనాలు లభించాయి. పట్టుబడిన పత్తి విత్తనాల విలువ రూ.54 వేల వరకు ఉంటుం దని, నిందితున్ని అరెస్టు చేసి కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్‌ఐ తెలిపారు. ఈ విత్తనాలను తన వ్యవసాయ భూమిలో వేసేందుకు తీసుకురావడం జరిగిందని నమ్మదగిన సమాచారం మేరకు దాడి చేసి పట్టుకోవడం జరిగిందని ఆయన తెలిపారు.

ప్రభుత్వ నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు ఎట్టి పరిస్థితుల్లో అమ్మ రాదని, అలాగే వీటిని రైతులు కూడా కొనుగోలు చేసుకోవద్దని ఎక్కడైనా అమ్ముతున్నట్లు సమాచారం తెలి స్తే వెంటనే తమకు తెలియజేయాలని కోరా రు. తాండూర్ మండల వ్యవసాయ అధికారిని సుష్మ పర్యవేక్షణలో పంచనామా నిర్వ హించడం జరిగిందని ఎస్సై తెలిపారు.