23 April, 2026 | 1:26 AM

తెలుగువాళ్ల ప్రేమను వీళ్లకు పరిచయం చేద్దాం

23-04-2026 12:00 AM

కేరళ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేసిన మలయాళ చిత్రం. నిర్మాత సాహు గారపాటి తన బ్యానర్ షైన్ స్క్రీన్స్‌పై విపిన్ దాస్, హారిస్ దేశం, పీబీ అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించారు. సావిన్ ఎస్‌ఏ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ హెచ్, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్, వినాయక్ వీ నటించారు.

తెలుగులో ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా హీరో తేజ సజ్జా, డైరెక్టర్ గోపీచంద్ మలినేని ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ ఈవెంట్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ.. “తెలుగు ప్రేక్షకులిచ్చే ప్రేమ ఇంకెక్కడా దొరకదు. ఏ భాషతో సంబంధం లేకుండా వచ్చిన ప్రతి సినిమాను మన ప్రేక్షకులు ఆదరిస్తారు. ఏప్రిల్ 24న అందరూ థియేటర్లకు వెళ్లి ‘వాలా 2’ను చూడండి. మన తెలుగు ప్రేక్షకులు చూపించే ప్రేమ ఏమిటో వీరందరికీ పరిచయం చేద్దాం” అన్నారు.

చిత్ర నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. “విపిన్ దాస్‌ను కలిసినప్పుడు ‘వాలా 1’లో నేను లేను, ‘వాలా 2’లో కలిస్తే బాగుంటుందని చెప్పాను. అలా మలయాళ ఇండస్ట్రీలోకి వెళ్లాను. చాలా మంచి సినిమా తీశాం, క్లైమాక్స్‌లో అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ గోపీచంద్ మలినేనితోపాటు చిత్ర తారాగణం అలన్, హషీర్, దేవరాజ్, అజిన్, విపిన్ దాస్, దర్శకులు సావిన్ ఎస్‌ఏ, సాగర్ కే చంద్ర కూడా మాట్లాడారు.