7 August, 2026 | 4:56 PM

Breaking News

గణపురం జడ్పీహెచ్‌ఎస్‌లో ముందస్తు బోనాల సంబరాలు   •   క్విట్ ఇండియా స్ఫూర్తితో జైలు భరో కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి   •   వానాకాలం పంటలకు పోచారం ప్రాజెక్టు నీటి విడుదల   •   అచ్చంపేటలో ప్రజాస్వామ్య హక్కులు దెబ్బతింటున్నాయి   •   విద్యాభివృద్ధికి ఎనలేని కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   బీజేపీ కిసాన్ మోర్చా నూతన మండల అధ్యక్షులకు నియామక పత్రాల అందజేత   •   అన్నపూర్ణ పంప్ హౌస్ లు ఆన్ చేయాలి: సిద్ధం వేణు   •   గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   ఆరేళ్ల నిరీక్షణకు తెర.. మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్   •   అర్బన్ రెసిడెన్షియల్ తనిఖీ చేసిన అదనపు కలెక్టర్   •  

నగరంలో శాంతిభద్రతలను కాపాడదాం

30-10-2024 01:16 AM

హైదరాబాద్ సీపీ ఆనంద్

వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 29 (విజయక్రాంతి): కొద్ది రోజులుగా నగరంలో జరుగుతున్న ఘటనలపై హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ దృష్టి సారించారు. ఈ మేరకు మంగళవారం కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఎన్జీవో సంస్థలతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. నగరంలో ఆశ్రయం లేని వ్యక్తులకు సంబంధించిన అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, వీరిలో కొంతమంది మానసిక స్థితి సరిగా లేక మతపరమైన ప్రదేశాల వద్దకు వెళ్తున్నారని, వారిని తనిఖీ చేసి కట్టడి చేయకపోతే భవిష్యత్‌లో నగరంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించే  అవకాశం ఉందని పేర్కొన్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా  పరిష్కార మార్గాలపై విస్తృతంగా చర్చించి సలహాలు, సూచనలు తీసుకున్నారు. ప్రిజనర్స్ డీజీపీ డా.సౌమ్య మిశ్రా, అడిషనల్ సీపీ లా ఆండ్ ఆర్డర్ విక్రమ్ సింగ్ మాన్, ప్రిజనర్స్ ఐజీపీ ఎం మురళీబాబు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, లేబర్ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ రమాదేవి, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఐజీపీ వీబీ కమలాసన్‌రెడ్డి, అడిషనల్ సీపీ ట్రాఫిక్ పీ విశ్వప్రసాద్, రోడ్డు సేఫ్టీ ఐజీపీ కే రమేశ్ నాయుడు,  రైల్వేస్ డీఐజీ మహ్మద్ శాదాన్ జెబ్‌ఖాన్ పాల్గొన్నారు.