17 April, 2026 | 10:30 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

వరంగల్ సభను విజయవంతం చేద్దాం

19-04-2025 12:00 AM

స్వయంగా వాల్ పెయింటింగ్ వేసి ప్రచారాన్ని ప్రారంభించిన మాజీ మంత్రి జోగు రామన్న 

ఆదిలాబాద్, ఏప్రిల్ 18 (విజయ క్రాంతి) : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ 14 ఏళ్లపాటు శ్రీరాముని వనవాసం స్ఫూర్తితో పోరాడి రాష్ట్రాన్ని సాధించి, అన్నీ రాష్టాలకు తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దరని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీ  రజతోత్సవ వేడుకల సందర్భంగా వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సభ విజయవంతానికై ఆదిలాబాద్ లో పార్టీ శ్రేణులతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాజీ మంత్రి స్వయం గా  పార్టీ జెండా గద్దెకు రంగులు వేస్తూ, గోడలపై ప్రచార వాల్ పెయింటింగ్ లు వేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు.

ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. ప్రాణాన్ని పణంగా పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు.  బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకువచ్చి వారి అభివృద్ధికి పాటుపడడం జరిగిందన్నారు. ఆంధ్ర సమైక్య పాలనలో తెలంగాణకు నిధులు, నీళ్లు, ఉద్యోగాలు లేక కరువు ఉండేదని,  నేడు ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సుభిక్షంగా విద్యా, వైద్యం, ఉద్యో గం అన్ని రంగాలలో ముందుండేలా కేసీఆర్ ప్యూహాత్మకంగా పాలన సాగించారని గుర్తు చేశారు.

కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తెలంగాణ ప్రతిష్టను  దిగజారుస్తుందని యావత్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరాన్ని మరోసారి దెబ్బ తీసే ప్రయత్నంలో కాంగ్రెస్ మోసపూరిత పాలన కొనసాగిస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రజల ఆశీర్వాదంతో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు ఇజ్జగిరి నారాయణ, అజయ్, శ్రీనివా స్, గండ్రత్ రమేష్, సంతోష్, నర్సాగౌడ్, విట్టల్, కుమ్రా రాజు తదితరులు పాల్గొన్నారు.