100 రోజులపాటు మొక్కలు నాటుదాం
వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ మహాజన్ జితేందర్..
ఖానాపూర్ (విజయక్రాంతి): పర్యావరణ దినోత్సవ(World Environment Day) సందర్భంగా వంద రోజులు ప్రతిరోజు రెండు మొక్కల చొప్పున మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని వాసవి క్లబ్ డిప్యూటీ గవర్నర్ మహాజన జితేందర్(Vasavi Club Deputy Governor Mahajan Jitender), అధ్యక్షులు చిటికేశి రవీందర్ అన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని వాసవి మాత దేవాలయంలో వాసవి క్లబ్, అనిత క్లబ్ ఆధ్వర్యంలో గురువారం మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రతిరోజు రెండు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామని, వాటి సంరక్షణ కూడా తామే చూసుకుంటామని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి చిటికేసి సతీష్ కుమార్, కోశాధికారి కూరగాయల సతీష్ కుమార్, వనిత క్లబ్ అధ్యక్షురాలు శ్రీమతి కటకం స్వరూప రాణి, కార్యదర్శి నీలి శ్రీలత, కోశాధికారి మారా రమ, కట్కం వేణుగోపాల్, కటకం అశోక్ కుమార్, తదితరులు ఉన్నారు.






