16 April, 2026 | 10:08 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునే ప్రభుత్వ బడులను కాపాడుకుందాం

11-06-2025 12:22 AM

కృష్ణ జూన్ 10. మండల కేంద్రంలోని ముడుమాల గ్రామంలో విద్యాశాఖ ఆదేశాల మేరకు ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మంగళవారం పాఠశాల ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు సంయుక్తంగా ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెంచాలని విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలో గల వసతుల గురించి ప్రభుత్వ పాఠశాలల గొప్పతనాన్ని గురించి అవగాహన కల్పిస్తున్నారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు గ్రామ ప్రజలతో యువకులతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బడి ఈడు వయసు గల పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి వారి అభివృద్ధికి కృషి తోడ్పడాలని పేర్కొనడం జరిగింది ఈ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా మంచి నాణ్యమైన విద్య అందుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్లు తదితరులుపాల్గొన్నారు.