05-07-2025 12:11:03 AM
యూనైటెట్ ఫోరం ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ పిలుపు
ముషీరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలతో పాటు 4 కొత్త లేబర్ కోడ్ లను రద్దు చేయ్యాలని డిమాండ్ చేస్తూ కేంద్ర కార్మిక సంఘా ల, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈనెల 9 న దేశవ్యాప్త సమ్మెలో బ్యాంకింగ్, ఇన్యూరెన్స్ రంగాల ఉద్యోగులుపెద్ద ఎత్తున పాల్గో ని విజయవంతం చేయాలని ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు పిలుపునిచ్చారు.
సార్వత్రిక సమ్మె సన్నద్దంలో భాగంగా హైదరాబాద్, కోఠిలోని ఎఐబిఇఎ రాష్ట్ర కార్యాలయంలో గురువారం యూనైటెట్ ఫోరం ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ (యుఎఫ్పియు) రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
పబ్లిక్ సెక్టార్ యూనియన్స్ కోఆర్టినేటర్ వి.ఎస్.బోస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎఐబిఇఎ జాతీయ కార్యదర్శి బి.ఎస్. రాంబాబు, యుఎఫ్పియు కన్వీనర్ ఎన్.వి. రమణ, ఎఐపిఆర్డిఎ రాష్ట్ర కార్యదర్శి ఎం.డి. జలాల్లూద్దిన్, ఎం.శివశంకర్ (జిఐజిఎఐఎ, తెలంగాణ) బి. నర్సింహులు (పోస్టల్ యూనియన్,తెలంగాణ), పి.అజ య్ కుమార్, పి. ఉదయ్ భాస్కర్, (డిజిఎస్, ఎపిటిబిఇఎఫ్), ఎఐబిఒఇ అధ్యక్షులు పిఎస్పిఆర్ పణికుమార్, జిఐఇఎఐఎ ఆర్గనైజింగ్ సెక్రటరీ సి.కిషన్లు హాజరయ్యారు.
ఈ సంద ర్బంగా రాంబాబు మాట్లాడుతూ నూతన ఆర్థిక విధానాల పేరుతో కేంద్ర ప్రభుత్వం తిరోగమన పోకడలను అనుసరిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలైన బ్యాంక్లు, ఇన్సురెన్స్ రంగాలను ప్రైవేట్ప రం చేసేందుకు ఈ రంగాలను నిర్వీర్యం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. వి.ఎస్. బోస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి అనేక రాయితీలను ఇస్తూ కార్మికుల హక్కులను కాలరా స్తూ ఏకపక్షంగా కార్మిక చట్టాలను 4 కోడ్ల రూపంలో మార్చడం గర్హనీయమన్నారు.
ఈనెల 9న నిర్వహించే సార్వత్రిక సమ్మెలో దేశ వ్యాప్తం గా 25 కోట్లమంది సంఘటిత, అసంఘటిత కార్మికులు, రైతులు, బ్యాంకింగ్, భీమా రంగం ఉద్యోగులు పాల్గొంటున్న ఈ సమ్మె లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యమై విజయంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.