05-07-2025 12:19:15 PM
రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టివి9 రిపోర్టర్ ప్రసాద్ ఆకస్మిక మరణం పట్ల రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంతాపం వ్యక్తం చేశారు... ప్రసాద్ మరణం జర్నలిస్టు లోకానికి తీరని లోటని, చిన్న వయస్సులో మరణించడం బాధాకరమన్నారు.వారు మీడియా రంగంలో పనిచేస్తూ జిల్లాలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించి ప్రజా సమస్యలను మీడియాతో పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారని పేర్కొన్నారు.. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని,ఈ సమయంలో వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు..