4 May, 2026 | 4:33 AM

ఏం జరుగుతుందో చూద్దాం

05-10-2024 01:36 AM

సనాతన ధర్మంపై పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి రిప్లు

చెన్నై, అక్టోబర్ 4: సనాతన ధర్మాన్ని ఎవరూ తుడిచిపెట్టలేరని.. అలా చేయాలనుకున్నవారే తుడిచిపెట్టుకుపోతారు అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. సనాతన ధర్మం గురించి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి? అని మీడియా ప్రతినిధులు ఉదయనిధిని ప్రశ్నించగా.. ఆయన ‘ఏం జరుగుతుందో చూద్దాం’ అని ముక్తసిరిగా వ్యాఖ్యానించి వెళ్లిపోయారు.

కాగా తిరుపతి లడ్డూ వివాదం నేపథ్యంలో పవన్ కల్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడటం పట్ల ఆయనపై పలువురు విమర్శలు చేయడం మొదలైంది. అయితే పవన్ తన ప్రసంగంలో ఉదయనిధి పేరును ప్రస్తావించనప్పటికీ సనాతన ధర్మం గురించి ఆయన తమిళంలో సవాల్ విసరడంతో అది తమిళనాడులోని అధికార డీఎంకే పార్టీ నేతలనే సంధించారని తెలస్తోంది. దీనికి తోడు గతంలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే.