28 June, 2026 | 3:07 PM

Breaking News

రేవంత్ రెడ్డి చేస్తున్న దుర్మార్గాలు ఆయనకు కనపడట్లేదు   •   ఇరాన్ స్థావరాలపై అమెరికా సైన్యం రెండో రోజూ దాడులు   •   135వ మన్ కీ బాత్.. యువతలోని సృజనాత్మకతకు పెద్దపీట: ప్రధాని మోదీ   •   రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •  

కుట్రలను తిప్పికొడదాం

05-04-2025 12:35 AM
  • జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో గ్రామాల్లో పాదయాత్రలు

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్

హన్వాడ ఏప్రిల్ 4 : ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేందర్  అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని వేపూర్, గుండ్యాల, కిష్టం పల్లి గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదంతో ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగాన్ని కాపాడుకోకపోతే సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు పూర్తిగా నిరుపేదలకు దూరమయ్యే ప్రమాదాలు ఉందని, రాజ్యాంగ ఫలాలు అన్ని వర్గాలకు అందాలంటే బిజెపి కుట్రలను తిప్పి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి టంకార కృష్ణయ్య, మండల కోఆర్డినేటర్ వెంకటయ్య, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నవనీత, వి.యాదవ రెడ్డి, చెన్నయ్య, గుండ్యాల గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, మండల నాయకుడు బొట్టు శీను కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.