26 May, 2026 | 7:31 AM

విచారణ భయంతోనే లేఖ

17-06-2024 12:10 AM
  1. కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి 

పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ 

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ జరుపుతున్న విశ్రాంత న్యాయమూర్తి పీసీ ఘోష్ నుంచి విచారణను తప్పించుకోవడానికే జస్టిస్ నర్సింహారెడ్డికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేఖ రాశారని పీసీసీ ఉపాధ్యక్షుడు జీ నిరంజన్ ఆరోపించారు. ఒక జస్టిస్‌ను అర్హత కోల్పోయారని, నిష్పాక్షికత కనిపించడం లేదని ధిక్కారపూర్వకంగా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివారం ఆయన ఒక ప్రకనటలో పేర్కొన్నారు. కేసీఆర్ ఇంకా తానొక్కడినే మేధావినని, తనకే అన్ని తెలుసనే విధంగా చట్టానికి అతీతుడని  భావిస్తున్నారని నిరంజన్ మండిపడ్డారు. 10 ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ జస్టిస్‌పై మాట్లాడే విధానం సరికాదని, అహంకారం, అహంభావానికి నిదర్శమన్నారు.