26 May, 2026 | 6:31 AM

రైతుల కోసం పనిచేయండి

17-06-2024 12:10 AM

మార్కెట్ కమిటీలకు మంత్రి తుమ్మల సూచన

హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి):  రాష్ట్రంలోని నెక్కొండ, కోటిపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు నూతన పాలక సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈసందర్భంగా నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.  పాలకవర్గం రైతుల కోసం పనిచేయాలని, మార్కెట్లో  ఎలాంటి సమస్యలు వచ్చిన త్వరగా స్పందించి పరిష్కారం మార్గం చూపేలా కృషి చేయాలని సూచించారు.