కేసీఆర్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి
సీపీఎం రాష్ట్ర నేత తమ్మినేని
హైదరాబాద్, జూన్ 16 (విజయక్రాంతి): రాజకీయ కక్ష సాధింపు కోసమే విద్యుత్ కొనుగోళ్ళపై విచారణ కమిషన్ ఏర్పాటు చేశారని మాజీ సీఎం కేసీఆర్ ఎదురుదాడికి దిగడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని సీతారాం ఒక ప్రకటనలో తెలిపారు. విచారణ పాదర్శకంగా లేకపోవడంతో తాను కమిషన్ ముందు హజరుకానని, చైర్మన్ స్వచ్ఛందంగా తప్పుకోవాలనడం మంచిది కాదన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో జరిగిన విద్యుత్ ఒప్పందం, యాదాద్రి, భద్రా ద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలను కేసీఆర్ సమర్థించుకుంటున్నారని ఆరో పించారు.
మార్కెట్‌లో తక్కువ రేటుకు విద్యు త్ కొనుగోలుకు అవకాశం ఉన్నా ఛత్తీస్‌గఢ్‌తో ఒప్పందం చేసుకోవడంపై ఆనాడే విమర్శలొ చ్చాయని, ప్రజలకు కూడా అనుమానాలు న్నాయని, వాటిని నివృత్తి చే యాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌పై ఉందని స్పష్టం చేశారు. అవసరమైతే విచారణ చేసుకోండి అని గతంలో ప్రక టించిన కేసీఆర్ ఇప్పుడు కుట్రపూరితంగా విచారణ చేయిస్తుందనడం అవకాశవాదమని అన్నారు. అదేవిధంగా విచారణ పూర్తికా కుండానే కమిషన్ మీడియా సమావేశం నిర్వహిం చడం కూడా సరైన పని కాదని పేర్కొన్నారు.






