సెప్టెంబర్ 17న విమోచనా దినోత్సవం నిర్వహించాలి
10-12-2024 01:22 AM
బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
డిసెంబర్ 9వ తేదీని తెలంగాణ పండుగ అంటున్న రాష్ట్రసర్కార్ ముం దుగా.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర విమోచనా దినోత్సవంగా ప్రకటించాలని, ఏటా ఆ తేదీన అధికారికంగా వేడుకలు నిర్వహించాలని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ డిమాండ్ చేశారు. తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు విషయమై సర్కార్ ప్రతిపక్షాల అభిప్రా యాలు తీసుకుంటే బాగుండేదన్నారు.
సర్కార్ విగ్రహాన్ని మార్చినంత మాత్రా న 4 కోట్ల మంది బతుకులు బాగు పడవని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిజంగా ప్రక్షాళన చేయాలనుకుంటే ప్రజల బతుకులు బాగుపడే నిర్ణయాలు తీసుకోవాలని ఉద్బోధించారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విగ్రహాలు మార్చుకుంటూ పోతుండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.






