నకిలీ గోల్డ్ ముఠా భారీ దోపిడీ!
- * రూ.100 కోట్లకు పైగానే బ్యాంకుల లూటీ
* బంగారు పూత పూసిన నకిలీ బ్రాస్‌లైట్స్, కడియాలు తాకట్టు
* ఖమ్మంలోని పలు బ్యాంకుల సిబ్బంది హస్తం?
ఖమ్మం, డిసెంబర్ 9 (విజయక్రాంతి): ఖమ్మంలో నకిలీ గోల్డ్ ముఠా పెద్ద ఎత్తున బ్యాంకులను మోసం చేసి, రూ.కోట్లు కొల్లగొట్టిన ఘటన కలకలం రేపుతోంది. కొంత మంది కేటుగాళ్లు మాఫియాగా ఏర్పడి, బ్యాంకుల్లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.100 కోట్లకు పైగా రుణాలు తీసుకుని మోసం చేసినట్టు తెలుస్తున్నది. బంగారం పూత పూసిన నకిలీ బ్రాస్‌లైట్స్, కడియాలు తయారు చేయించి, వాటిని ఖమ్మంలోని ఆరు బ్యాంకుల్లో బినామీ పేర్లతో కుదవబెట్టి, దాదాపు రూ.100 కోట్ల వరకు కాజేసినట్లు వెలుగులోకి వచ్చింది.
అంతర్గతంగా విచారణ
ఖమ్మం నగరంలోని కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ), పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఏపీ గ్రామీణ బ్యాంక్, భద్రాద్రి కో ఆపరేటివ్ బ్యాంక్ తదితర ఆరు బ్యాంకులను ఈ ము ఠా కొల్లగొట్టినట్లు సమాచారం. ఈ ముఠా ఒక్క ఖమ్మంలోనే కాకుండా ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు జిల్లాల్లో కూడా ఇలాగే నకిలీ బంగారాన్ని తయారు చేయించి, బ్యాం కులను మోసగించారనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. ఖమ్మం పోలీసుల కు తాజాగా కొన్ని బ్యాంకుల నుంచి ఫిర్యాదులు అందడంతో రంగంలోకి దిగి అంత ర్గతంగా విచారణ ప్రారంభించారు.
అయితే ఏఏ బ్యాంకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయనే విషయాన్ని పోలీసులు ఇంతవరకు వెల్లడించలేదు. బయటకు తెలిస్తే ఖాతాదారులు భయపడి, ఆందోళన చెందుతారనే కారణంతోపాటు బ్యాంకుల ఇమేజ్ దెబ్బతింటుంతనే కారణంతో బ్యాంకులు, పోలీసులు జాగ్రత్త పడుతున్నట్లు సమాచారం. తొలుత ఒక్క డీసీసీబీలోనే ఈ మోసం జరిగిందని భావించారు. ఆ తర్వాత మిగతా కమర్షియల్ బ్యాంకుల్లో కూడా విచారిస్తే వాటిల్లో కూడా ఈ ముఠా మోసానికి పాల్పడ్డట్లు వెలుగులోకి వచ్చింది.
26 మందిపై కేసులు!
బ్యాంకులు నకిలీ బంగారు కుదవపెట్టి 26 మందికి పైగానే రుణాలు పొందినట్లు తెలసింది. ఒక్కో వ్యక్తి రూ.లక్ష నుంచి రూ. లక్షన్నర వరకు రుణం పొందినట్లు తెలుస్తోం ది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 26 మందిపై కేసులు నమో దు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఆయా బ్యాంకుల సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ముఠాలోని కొంత మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది.
అప్రైజర్స్, సిబ్బంది హస్తం?
బ్యాంకుల్లో బంగారం నాణ్యతను పరీక్షించే అప్రైజర్స్ హస్తం కూడా ఉన్న ట్లు తెలుస్తోంది. వీరి సహకారం లేనిదే నకిలీ బంగారం తాకట్టు పెట్టడం సాధ్యంకాదని కొందరు అంటున్నారు. కేటుగాళ్ల బాగోతం వెనుక ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యా ప్తంగా అన్ని ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు తమ బ్యాంకుల్లోని బంగారం నిల్వలను తనిఖీ చేసే పనిలో పడ్డట్టు తెలిసింది. తమ బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారం అసలా ? నకిలీనా ? అనే అనుమానాలు తలెత్తడంతో ఆయా బ్యాంకుల సిబ్బంది హడావిడిగా తనిఖీలు చేసుకుంటూ నిర్ధరణ చేసుకుంటున్నారు. తేడా కనిపించగానే పోలీసుల వద్దకు పరుగులు తీస్తున్నారు.






