అనుమతులు జాన్తా నై
- పెద్దంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలో జోరుగా అక్రమ నిర్మాణాలు
- రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని.. కమర్షియల్ భవనాల నిర్మాణం
- చేయి తడిపితే చాలు అటువైపు కన్నెత్తి చూడని అధికారులు
- నిరుపేదలకు మాత్రం పర్మిషన్ల పేరిట నోటీసులు
అబ్దుల్లాపూర్‌మెట్, డిసెంబర్ 9: పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ పరిధిలో అక్రమ కట్టడాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతం కావడంతో ఇక్కడ రిసార్టులకు డిమాండ్ భారీగా పెరిగింది. దీంతో ఎలాంటి అనుమతులు లేకుం డానే కొందరు షెడ్లు, రిసార్టుల నిర్మాణం చేపడతూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అయితే అనుమతులు లేని, అను మతులకు మించి చేపడుతున్న నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు, ప్రజా ప్రతినిధులు.. అక్రమార్కులతో కుమ్మక్కై గమ్మునుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
మరికొందరమో రెసిడెన్షియల్ నిర్మాణాలకు పర్మిషన్ తీసుకొని.. కమర్షియల్ నిర్మాణాలను చేపడుతున్నా అధికారు లు అటువైపు కన్నెత్తిచూడటంలేదు. అయితే మున్సిపల్ పరిధిలోని మధ్యతరగతి ప్రజ లు.. ఇళ్ల పర్మిషన్లు తీసుకొని నిర్మాణాలు చేపడతున్నప్పటికీ వారికి సెట్‌బ్యాక్‌ల పేర్లతో నోటీసులు ఇస్తున్నారు అధికారులు.
భారీ షెడ్లు, రిసార్టుల నిర్మాణం..
పెద్ద అంబర్‌పేట్ మున్సిపాలిటీ పరిధిలోని తట్టిఅన్నారం 13 వార్డులో నాగోల్ నుంచి గౌరెల్లి వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున అనుమతులు లేని షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అలాగే తట్టి అన్నారం 18వార్డులో ఇదే రోడ్డుకు అనుకొని భారీస్థా యి షెడ్డు వెలసింది. అంబర్‌పేట్ 5వ వార్డు లో కూడా భారీ స్థాయిలో షెడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణానికి రెసిడెన్షియల్ పర్మిషన్లు తీసుకొని కమ ర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారు.
ము న్సిపల్ పరిధిలోని కుంట్లూరు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా రిసార్టులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. గ్రామంలోని 22వ వార్డులో ఓ రాజకీయ పార్టీ చెం దిన యువ నాయకుడు మున్సిపాలిటీ నుం చి ఎలాంటి అనుమతులు తీసుకో కుండానే రిసార్ట్ నిర్మాణం చేపడుతున్నాడు. అడ్డుకోవాల్సిన ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్మాణదారులను నుం చి అందినకాడికి లంచాలు తీసుకొని గమ్మునుండిపోతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పేదలకేమో నోటీసులు..
ఓవైపు బడాబాబులు అనుమతులు లేకున్నా నిర్మాణాలు చేపడతుంటే సైలెంట్‌గా ఉంటున్న అధికారులు.. మరోవైపు పేదలు కష్టపడి చిన్న ఇళ్లు, దుకాణం కట్టుకుంటున్నా అనుమతులు, సెట్‌బ్యాక్‌ల పేరుతో ఇబ్బందిపెడుతున్నారు. 100, 120 గజాల్లో ఇళ్లు నిర్మించుకుంటున్నా నోటీసులు పంపించి మానసికంగా వేధిస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం
మున్సిపాలిటీ పరిధిలో చేపడుతున్న నిర్మాణాలను క్షేత్రస్థాయి లో పరిశీలిస్తాం. ఎవరైనా అనుమతులు లేకుండా, అనుమతులకు మించి నిర్మాణాలు చేపడితే తప్పకుండా వారికి నోటీసులు అంది స్తాం. తదుపరి ఉన్నతాధికారుల సూచన మేరకు అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం.
ఎస్ రవీందర్ రెడ్డి, కమిషనర్, పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ






