15 April, 2026 | 1:52 PM

Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాలను తక్షణమే ప్రారంభించాలి.. సీపీఐ డిమాండ్   •   చీల‌ప‌ల్లిలో పొంగిపొర్లుతున్న నిర్లక్ష్యం   •   మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై దాడి   •   అక్రమాలు ప్రశ్నిస్తే కక్ష కట్టారు   •   ఎక్సైజ్ కోర్టు కానిస్టేబుల్ కు ఘనంగా వీడ్కోలు   •   ట్రాక్టర్ డీకొని బాలుడికి తీవ్రగాయాలు   •   గ్రామీణ అభివృద్ధితో ప్రజల జీవన ప్రమాణాల పెంపు లక్ష్యం   •   టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా షాద్‌నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు   •   మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •  

తులం బంగారం హామీ నిలబెట్టుకోవాలి

27-02-2026 01:01 AM

ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచన

నేరడిగొండ, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందాయని, అందులోనే ఒకటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని రైతు వేధికలో ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే  మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 30 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.   

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎక్కడ లేని విధంగా పేదింటి బిడ్డకు ఆసరాగా నిలవాలని  తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకాలను ప్రారంభించారన్నారు. ఇప్పుడున్న అధికార కాంగ్రెస్ పార్టీ లక్ష రూపాయలతో పాటు ఇస్తామన్న తులం బంగారం సైతం ఇచ్చి హామీ నెరవేర్చుకోవలన్నారు.   

ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నీలిమ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ గులాబ్, మాజీ ఎంపీపీ రాథోడ్ సజన్, మాజీ జడ్పీటీసీ పండరీ, జహీర్, పీఏసీఎస్ చైర్మన్ నానక్ సింగ్, అనిల్ జాదవ్ యువసేన అధ్యక్షులు దేవేందర్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు శ్రీకాంత్, కృష్ణా, గంగాధర్, నాయకులు రాథోడ్ సురేందర్, కార్యకర్తలు పాల్గొన్నారు.