తండ్రి-కొడుకులకు జీవిత ఖైదు
పోక్సో కేసులో ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పు
మేడ్చల్, జూన్ 5 (విజయక్రాంతి): పోక్సో కేసులో తండ్రి కొడుకులకు జీవిత ఖైదు విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టు తీర్పునిచ్చింది. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ కొంపల్లిలో శివకుమార్(45), అతని కుమారుడు అలియాస్ సామెల్ (21) 2023 ఆగస్టు 10న ఉదయం 9 గంటల సమయంలో పక్క ఇంట్లో తల్లిదండ్రులు పనికి వెళ్లిన సమయంలో ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి చేశారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితులను అరెస్టు చేశారు.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ జడ్జి కె. వెంకటేష్ ఈ కేసును పూర్తిస్థాయి విచారణ చేసి ఇద్దరు నిందితులను దోషులుగా తీర్పునిచ్చారు. ఇద్దరికీ జీవిత ఖైదుతో పాటు రూ.10వేలు జరిమానా విధించారు. బాధితురాలికి రూ.ఐదు లక్షల నష్టపరిహారం కూడా విధించారు.






