6 June, 2026 | 2:08 AM

నికోబార్ పరిరక్షణకు.. టీ కాంగ్రెస్ సంఘీభావం

06-06-2026 12:52 AM

రాహుల్‌గాంధీ పోరాటానికి సంపూర్ణ మద్దతు 

హైదరాబాద్, జూన్ 5 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పిలుపునకు మద్దతుగా, అండమాన్  నికోబార్ దీవు ల పరిరక్షణ కోసం టీపీసీసీ సంఘీభావం తెలియజేసింది. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కు మార్‌గౌడ్ మాట్లాడుతూ.. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అండమాన్- నికోబార్ దీవుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్ద తు ప్రకటిస్తున్నట్లు  ప్రకటించారు.

ప్రకృతి సంపదలను కాపాడుతూ అభివృద్ధిని ముం దుకు తీసుకెళ్లాలన్నది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతమని, పర్యావరణాన్ని ధ్వంసం చేసే అభి వృద్ధి దేశ భవిష్యత్తుకు ప్రమాదకరమని పేర్కొన్నారు. ప్రకృతి పరంగా, భౌగోళికంగా ఎంతో పేరుగాంచిన నికోబార్ ఐలాండ్‌ను అదానీకి అప్పగించే ప్రక్రియ సాగుతోందని మంత్రి పొన్నం ప్రకటనలో ఆరోపించారు.