14 August, 2026 | 8:15 PM

Breaking News

స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధిదారులను కార్యక్రమానికి తరలించాలి   •   60 ఏళ్లుగా జీవనాధారంగా ఉన్న మడిగపై వివాదం   •   పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయాన్ని పరిశీలించిన ఆర్డీవో   •   నేను ఎలాంటి అసైన్ భూమిని కబ్జా చేయలేదు   •   హనుమాన్ దేవాలయాన్ని అన్ని హంగులతో నిర్మిస్తాం   •   ఉప సర్పంచ్, వార్డు సభ్యుల ఫోరం ఆసిఫాబాద్ మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఖర్గేకు సంఘీభావంగా ఆలేరులో కాంగ్రెస్ భారీ పాదయాత్ర, సత్యాగ్రహం   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   విద్యార్థులకు పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన   •   సాగర్‌ ఎడమ కాలువకు నీళ్లు ఎప్పుడు..?   •  

ప్రాణమే ప్రేమకై కలవరిస్తున్నది!

23-09-2024 12:44 AM

విలక్షణ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ నుంచి వస్తున్న మరో చిత్రం ‘శారీ’. గిరికృష్ణకమల్ దర్శకత్వంలో ఆర్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రవివర్మ నిర్మించారు. సత్య యాదు, ఆరాధ్య దేవి హీరో హీరోయిన్లుగా పలు నిజజీవిత సంఘటనల ఆధారాలతో సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నవంబర్‌లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ప్రక్రియలో రూపొందించిన సంగీతాన్ని ఉపయోగించారు. ఈ చిత్రంలో  ఏఐ టెక్నాలజీ మ్యూజిక్ సహాయంతో చిత్రీకరించిన ‘ఐ వాంట్ లవ్’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను ఆదివారం విడుదల చేశారు. వివిధ భాషల్లోని సాహిత్యంతో సాగుతున్న ఈ పాట ముఖ్యంగా యువతను ఉర్రూతలూగిస్తోంది. దీనికి సంబంధించి కొన్ని వీడియో క్లిప్స్‌ను ఆర్జీవీ ఇటీవల సోషల్ మీడియాలో వదలగా వైరల్‌గా మారింది. తాజాగా పూర్తి పాట రిలీజ్ చేయగా నిమిషాల్లోనే భారీ వ్యూస్ వచ్చాయి.