calender_icon.png 16 August, 2025 | 1:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భయమంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల!

23-09-2024 12:45:23 AM

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘దేవర’. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుది. ఇప్పటికే ఈ మూవీ నుంచి సాంగ్స్, గ్లింప్స్‌తోపాటు మొదటి ట్రైలర్ విడుదల చేయగా, విశేష స్పందన వచ్చింది. అటు అడ్వాన్స్ బుకింగ్‌లోనూ ఈ మూవీ సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ విడుదలైంది. రిలీజ్ ట్రైలర్ పేరుతో రిలీజ్ చేసిన ఇందులో ఎన్టీఆర్ పూర్తిగా ఊరమాస్ లుక్‌లో యాక్షన్ అదరగొట్టేశాడు. ట్రైలర్‌లో ‘భయం పోవాలంటే దేవుడి కథ వినాల.. భయమంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాల’ అని ప్రకాశ్‌రాజ్ వాయిస్ ఓవర్ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తుండగా.. షైన్ టామ్ చాకో, శ్రీకాంత్, ప్రకాశ్‌రాజ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు హరికృష్ణ కె, సుధాకర్ నిర్మాతలు.