13 July, 2026 | 3:28 AM

జీవితపు తపన

13-07-2026 02:28 AM

ఒక్క వాక్యం రాస్తందుకు 

గుండెను ఎన్నిసార్లు పిండుకోవాలో

బతుకును ఈదుతందుకు

ఎన్ని రకాల ఈతలు నేర్చుకోవాలో

ఎదుటివాళ్లను అర్థం చేసుకుంటందుకు

ఎన్ని అనుభవాలను చవిచూడాలో

కొత్త జీవితపు మొక్కలు నాటుతందుకు

ఎన్ని రాత్రులు వెలగాలో

మనసు గాయాలు మాన్పుతందుకు

ఎన్ని ఓపిక లేపనాలు రాసుకోవాలో

చేసిన తప్పును కప్పిపుచ్చుతందుకు 

ఎన్ని అబద్ధపు విత్తనాలు నాటాలో

అసలు.. మనిషిగా నిలవాలంటే 

ఎన్నిసార్లు మరణించి మళ్లీ పుట్టాలో !!