14 June, 2026 | 1:50 AM

ఇషా సింగ్‌కు లైఫ్‌స్పాన్ నజరానా

14-06-2026 12:40 AM

హైదరాబాద్, జూన్ 13 : జర్మనీ వేదికగా ఇటీవల జరిగిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్‌కప్‌లో 25 మీ. పిస్టల్ ఈవెంట్ రికార్డు ప్రదర్శనతో స్వర్ణం గెలిచిన హైదరాబాదీ యువ షూటర్ ఇషా సింగ్‌కు ప్రముఖ కంపెనీ లైఫ్‌స్పాన్ నజరానా అందించింది. ప్రత్యేకంగా ఏర్పా టు చేసిన కార్యక్రమంలో ఇషాను సత్కరించి రూ.3 లక్షల చెక్‌ను అందజేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధా న కార్యదర్శి జయేశ్ రంజన్, శాట్స్ వీసీ ఎండీ సోనీబాలాదేవి, తెలుగు రాష్ట్రాలకు బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ హాజరయ్యారు.

లైఫ్‌స్పాన్‌కు ఇషా సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోం ది. ఆమె ప్రపంచకప్ విజయాన్ని లైఫ్‌స్పాన్ ఛైర్మన్ డాక్టర్ నరేంద్ర రామ్ నంబుల ప్రత్యేకంగా కొనియాడారు. ఇషా విజయాన్ని గౌర వించడం సంతోషంగా ఉందని, ఆమె సాధిస్తున్న విజయాలు దేశానికే గర్వకారణమ న్నారు. భావి తరాలకు స్ఫూర్తినిచ్చే క్రీడాప్రతిభను ప్రోత్సహించేందుకు లైఫ్ స్పాన్ ఎ ప్పుడూ ముందుంటుందన్నారు.