వెలుగు నీడల హౌసింగ్ బోర్డు
- బోర్డుకు పూర్వ వైభవం వచ్చేనా?
- సొంత రాష్ట్రంలో సంస్థపై నిర్లక్ష్యం
- బోర్డు ఆధీనంలో 2,600 ఎకరాల భూమి
- ప్లాట్ల ఏర్పాటుకు సర్కార్ పై ఆశలు
హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన హౌసింగ్ బోర్డు సొంత రాష్ట్రంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైంది. గతంలో కూకట్‌పల్లి, మౌలాలి వంటి అనేక ప్రాంతాల్లో దాదాపు 200 వరకు హౌసింగ్ బోర్డు కాలనీలను సంస్థ ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభ జనకు ముందు అంటే 2014లో రంగారెడ్డి జిల్లా రావిరాలలో 550 ప్లాట్లు, కూకట్‌పల్లి పరిధిలో ఒక అపార్ట్‌మెంట్ నిర్మించింది. అందులో 270 ప్లాట్లకు నోటిఫికేషన్ ఇచ్చి 2016 సంవత్సరంలో ఆ ప్రాజెక్టులను పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేశారు.
విభజన తర్వాత మాత్రం ఒక్క వెంచర్‌కు కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదు. హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో ఎల్‌ఐజీ, ఎంఐజీ, హెచ్‌ఐజీ పేరుతో కాలనీలను ఏర్పాటు చేసి సామా న్య, మధ్యతరగతి ప్రజలకు అందుబాటు ధరలతో స్థలంతో పాటు ఇండ్లను కూడా నిర్మించి ఇచ్చింది. పేదలు, చిరుద్యోగులకు సొంతింటి కలను నెరవేర్చిందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ వ్య క్తుల నుంచి భూములు కొని వాటిని ప్లాట్లుగా మార్చి ఒకే మాదిరిగా ఇళ్లను నిర్మించి.. నో లాస్.. నో ప్రాఫిట్ పేరుతో సొంత ఇళ్ల ను లబ్ధిదారులకు అందించేది.
అంతేకాకుం డా హౌజింగ్ బోర్డు నుంచి ఇంటిని కొనుగోలు చేస్తే అన్ని రకాలుగా డాక్యుమెంట్స్ పక్కాగా ఉంటాయని లబ్ధిదారులు భావిస్తుంటారు. హౌసింగ్ బోర్డులో ఇంటిని కొనే లబ్ధిదారుడు ముందుగా 30 శాతం నిధును చెల్లించాల్సి ఉంటుంది, ఆ తర్వాత బ్యాంకుల నుంచి రుణం తీసుకొని నెల నుంచి మూడు నెలల్లో బోర్డుకు పూర్తిగా చెల్లించాల్సి ఉంటుంది.
కొత్త ప్రభుత్వంపై ఆశలు..
రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై హౌసింగ్ బోర్డు సంస్థ అశలు పెట్టు కున్నది. ఖాళీగా ఉన్న భూముల చుట్టు కంచె లు, ప్రహరీల నిర్మాణాలకు కొన్ని నిధులు కే టాయించడమే కాకుండా టౌన్‌షిప్‌ల ఏర్పాటుకు ప్లాన్ చేస్తుందని అధికారులు చెబు తున్నారు. వీటిలో హౌసింగ్ బోర్డుకు అవకాశమిస్తే పేద వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
నిజాం హయాంలోనే (సీఐబీ) హౌజింగ్ బోర్డు ఏర్పాటు..
మూసీనదికి వరదలు రావడంతో ఇళ్లు కొట్టుకుపోయి వేలాది మంది నిరాశ్రయులు కావడంతో అప్పటి నిజాం సర్కార్ సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు (సీఐబీ)ను 1911వ సంవత్సరంలో ఏర్పాటు చేసింది. అప్పుడు మూసీనది వరదలతో నిరాశ్రయులైన వారికి నిజాం సర్కార్ ఇళ్లు నిర్మించి ఇచ్చింది. నిజాం నుంచి తెలంగాణకు విముక్తి కలగడం, ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ మండలిగా ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ గృహ నిర్మాణ మండలిగా ఏర్పాటై విధులు నిర్వహిస్తోంది.
హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డిలోనే ఎక్కువగా భూములు..
హౌసింగ్‌బోర్డు పరిధిలో రాష్ట్రవ్యా ప్తంగా 2,600 ఎకరాల భూములు ఉన్నట్లుగా సమాచారం. ఇవి ఎక్కువగా హైద రాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోనే ఉన్నాయని, ఇప్పుడు వాటి విలువ వేలకోట్లలో ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఉమ్మ డి రంగారెడ్డిలోని భూములన్నీ ఔటర్ రింగ్‌రోడ్డు లోపలే ఉన్నాయి. బాటసింగారం, కోహెడ, అబ్దుల్లాపూర్‌మెట్, మంగళపల్లి, గడ్డి అన్నారం, అజీమ్‌నగర్, రావిరాల, చింతల్, వట్టినాగులపల్లి, కౌకూ ర్, రాయదుర్గం, గచ్చిబౌలి, నిజాంపేట్, పోచారం, బాచుపల్లి, గాజులరామారం, కొత్తగూడ ప్రాంతాల్లో హౌసింగ్‌బోర్డుకు భూములున్నాయి. అయితే అక్కడక్కడా కొంత భూమి ఆక్రమణకు గురైనట్లుగా అధికారులు చెబుతున్నారు.
ఖాళీగా ఉన్న భూములకు చుట్టు ఫెన్సింగ్ లేదా ప్రహరీ నిర్మించడానికి గత ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం సిద్దిపేట, సూర్యాపేట జిల్లాల పరిధిలోని కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని తెలుస్తోంది. స్వతంత్ర సంస్థగా ఉన్న హౌసింగ్ బోర్డు భూమిని ప్రభుత్వం తీసుకుంటే.. అంతే భూమిని ఎక్కడైనా ఇవ్వడం లేదంటే మార్కెట్ విలువ ఆధారంగా పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. పదేళ్లుగా కాల నీల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి రాకపోవడంతో బోర్డుకు పనిలేకుం డా పోవడంతోపాటు నిర్వీర్యమయ్యే పరిస్థితి వచ్చిందని చెబుతున్నారు.
హౌసింగ్ బోర్టు వివిధ రకాలుగా నిర్మాణాలు.. వాటి పరిమితి
- ఎల్‌ఐజీలో 111 నుంచి 133 చదరపు గజాలు
- ఎంఐజీ 200 నుంచి 233 చదరపు గజాలు
- హెచ్‌ఐజీ 266 నుంచి 400 చదరపు గజాలు






