10 May, 2026 | 11:03 AM

పంచాయతీ పోరుకు సన్నద్ధం

30-08-2024 01:00 AM
  1. ఏర్పాట్లు చేస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం 
  2. వచ్చే నెల 6న పంచాయతీ, వార్డులవారీగా 
  3. ఓటర్ జాబితా ముసాయిదా విడుదుల 
  4. తప్పుల సవరణకు 13 వరకు ఫిర్యాదులు 
  5. 21న సవరించిన తుది జాబితా విడుదల 
  6. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ వెల్లడి 
  7. కలెక్టర్లు, పంచాయతీ అధికారులతో చర్చ

హైదరాబాద్, ఆగస్టు 29 (విజయక్రాంతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం ఎప్పుడు అనుమతి ఇచ్చినా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. అందుకు ముందస్తు ఏర్పాట్లకు కసరత్తు చేస్తోంది. పంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ జాబితాను రూపొందిస్తోంది. సెప్టెంబర్ 6న గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద పంచాయతీలు, వార్డులవారీగా ఓటర్ జాబితా ముసాయిదాను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీ పార్థసారధి గురువారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా, డివిజన్ పంచాయతీ అధికారులు, అసెంబ్లీ నియోజకవర్గాల ఎలక్టోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఇందులో ఆయన మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తయారు చేసిన అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ జాబితాను యధావిధిగా పరిగణనలోకి తీసుకొని వార్డులు, గ్రామ పంచాయతీలవారీగా ఓటర్ లిస్టును తయారు చేయాలని ఆదేశించారు. ఆ తర్వాత మండల, జిల్లా స్థాయిలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి.. వారి సూచనలు, సలహాలు స్వీకరించాలని సూచించారు. 

పొరపాట్లపై రాతపూర్వక ఫిర్యాదులు

ఓటర్ జాబితా ముసాయిదాలో ఏమైనా పొరపాట్లు జరిగితే సెప్టెంబర్ 13వ తేదీవరకు సంబంధిత మండల, జిల్లా పరిషత్ అధికారులకు రాతపూర్వకంగా తెలియజేయాలని, వాటిని అధికారులు పరిశీలించాక సవరించిన తుది జాబితాను సెప్టెంబర్ 21న ప్రచురించాలని కమిషనర్ ఆదేశించారు. ఒకవేళ అర్హులైన ఓటర్లు తమ పేర్లను గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాలో చేర్చుకోవాలన్నా, ఎవరినైనా ఓటర్ లిస్టులో కొనసా గించడానికి ఆక్షేపణలు ఉన్నా, వారు నిర్దేశించిన ఫారంపై సంబంధిత అసెంబ్లీ నియో జకవర్గ ఎలక్టోరల్ రిజిస్టేషన్ అధికారికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గంలో ఆ ఓట ర్ చేర్పు, తొలగింపు జరిగిన తర్వాతనే గ్రా మ పంచాయతీ ఓటర్ లిస్టులో పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. వార్డుల వారీగా పోలింగ్ స్టేషన్ల ఏర్పాటు, పోలింగ్ సిబ్బంది వివరాల సేకరణ, రిటర్నింగ్, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల నియామకం, పోలింగ్ సిబ్బంది శిక్షణ తదితర విషయాలపై వివరించారు. వీటన్నింటికి రాష్ట్ర ఎన్ని కల సంఘం తయారు చేసిన నిబంధనలు తుఃచ తప్పకుండా పాటించాలని స్పష్టంచేశారు. జిల్లాలవారీగా జరుగుతున్న ఓటర్ లిస్టుల తయారీ పురోగతి, ఇబ్బందులు గురించి జిల్లా కలెక్టర్ల నుంచి వివరాలు సేకరించారు.

ఈ సందర్భంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహకారంతో తయారు చేసిన ‘గ్రీవెన్స్ మాడ్యూల్’ను రాష్ట్ర ఎన్నికల కమిష నర్ ఆవిష్కరించారు. ఈ మాడ్యుల్ ద్వారా ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, నిబంధనల ఉల్లంఘనపై సాధారణ పౌరులు కూడా ఫిర్యాదు చేయవచ్చని, ఆ ఫిర్యాదుదారుని వివరాలు రహస్యంగా ఉంచుతామని ప్రకటించారు. ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకొని ఫిర్యాదుదారునికి సమాచారం ఇస్తా రని చెప్పారు. దీంతో ఎన్నికలు మరింత పా రదర్శకంగా, నిబంధనల మేరకు జరగడానికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి లో కేష్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్ తదితర అధికారులు పాల్గొన్నారు.