15 June, 2026 | 11:44 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్‌కు లింకు కలపాలి

30-12-2025 12:00 AM

అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే విజయుడు 

అలంపూర్, డిసెంబర్ 29: చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి ఆర్డీఎస్‌కు లింకు కలపడం వల్ల అలంపూర్ ప్రాంత రైతాంగానికి రెండు పంటలకు సాగునీరు అందడంతో పాటు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని అలాగే జూలకల్లు, మల్లమ్మ కుంట రిజర్వాయర్లను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే విజయుడు కోరారు. హైదరాబాదులో సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే పలు సమస్యలను ప్రస్తావించారు. నియోజకవర్గంలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారాయని దీంతో తరచూ ప్రమాదాలు సంభవిస్తున్నాయని రోడ్లను బాగు చేయాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు.

అదేవిధంగా నెట్టెంపాడు 99 అండర్ ప్యాకేజ్ కింద అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడంతో ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగస్తులకు పక్కనున్న ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు వీలు కల్పించాలని కోరారు. అలాగే గత పాత సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులను మొత్తం చెల్లించి అలాగే కొత్తగా ఏర్పడిన సర్పంచులకు అత్యధికంగా నిధులు కేటాయించి గ్రామాల అభివృద్ధికి తోడ్పాలని  కోరారు. అల్లంపూర్ పరిధిలోని అలంపూర్, అయిజ, వడ్డేపల్లి మున్సిపాలిటీలకు ఎక్కువ నిధులు మంజూరు చేసి అభివృద్ధికి దోహదపడాలని సభాపతి ద్వారా ప్రభుత్వాన్ని కోరారు.