15 April, 2026 | 7:54 AM

మాజీ సర్పంచుల ముందస్తుగా అరెస్టు

30-12-2025 12:00 AM

మాగనూరు, డిసెంబర్ 29: మాజీ సర్పంచులు గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర సర్పంచుల సంఘం, జేఏసీ ఆధ్వర్యంలో మాజీ సర్పంచుల ద్వారా అసెంబ్లీకి ముట్టడి కి పిలుపు నివ్వడంతో  పోలీసులు సోమవారం ముందస్తుగా మండలంలోని వాడ్వాటు మాజీ సర్పంచ్ నరసింహులు, వర్కూరు మాజీ సర్పంచ్ మల్లారెడ్డిని  పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా గత సర్పంచులు చేసిన అభివృద్ధి పనులకు బిల్లు ఇవ్వకుండా కాలయాపన చేయడం సరైనది కాదని వారు మండిపడ్డారు. పెండిం గ్ బిల్లులు సాధించేవరకు ఏ ఉద్యమానికైనా సిద్ధంగా ఉన్నామని ఎన్ని అరెస్టులు చేసినా వెనకాడ బోమని వారి సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలోఎఎస్‌ఐ మన్నా న్, పోలీస్ సిబ్బంది తదితరులు.