3 March, 2026 | 9:38 PM

మున్సిపల్ చైర్‌పర్సన్‌ను సన్మానించిన లయన్స్ క్లబ్ 320ఈ గవర్నర్

03-03-2026 12:00 AM

వైరా, మార్చి 2(విజయ క్రాంతి) : ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్  డిస్టిక్  320 ఈ గవర్నర్ మదన్మోహన్ రేపాల ఆధ్వర్యంలో ఆదివారం వైరాలోని మున్సిపాలిటీ చైర్పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ మురళీకృష్ణ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ గవర్నర్ మదన్ రేపాల మాట్లాడుతూ పట్టణ ప్రజలు కౌన్సిలర్లు  సహకారాలతో పట్టణ సమస్యలు పరిష్కరించడం పాటు మౌలిక వసతులు కల్పించాలని పట్టణాన్ని సుందరీ కారణంగా తీర్చిదిద్ది ప్రజల్లో మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో 20 వార్డు కౌన్సిలర్ ఉండ్రువరలక్ష్మి శ్యాంబాబు, దంపతులను సన్మానించారు లయన్ లేడీ విజయలక్ష్మీ విడిజీ 1లయన్ ,  కేవీ ప్రసాద్, విడిజీ 2 కోడ్ సతీష్ కుమార్, పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్స్ యానాల మోహన్ రెడ్డి యరాల ప్రభాకర్ రెడ్డి డిసిఎస్ రామకృష్ణ చిలుకూరి, డిసిటి అశోక్ రెడ్డి గట్టుపల్లి, డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ కోఆర్డినేటర్ లగడపాటి ప్రభాకర్ రావు జిల్లా నాయకులు శ్రీకాంత్ తోటకూర గ్రేట్ విజన్ క్లబ్ అధ్యక్షులు జాలా పుల్లారావు సెక్రటరీ గంగవరపు కిషన్ పలువురు పాల్గొన్నారు.