09-02-2026 12:00:23 AM
ఈసీ నిబంధనలకు తూట్లు!
నిఘా యంత్రాంగం పర్యవేక్షణ ఏది?
అలంపూర్, ఫిబ్రవరి 08:మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం పర్వం కీలక దశకు చేరుకోవడంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు ఆ యా పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో అ భ్యర్థులు కూడా ఖర్చుకు వెనుకాడడం లేదనే చర్చ మొదలైంది.ముఖ్యంగా వడ్డేపల్లి మునిసిపల్ లో త్రిముఖ పోటీ ఏర్పడిన సంద ర్భంలో.....
అందులో ఆదివారం కావడంతో ఓటర్లను చిల్ చేసేందుకు అభ్యర్థులకు సం బంధించిన వార్డుల్లో కార్యకర్తలు ఏకంగా ఓటర్ల ఇంటింటికి వెళ్లి మద్యం బాటిల్, చికెన్ ప్యాక్ చేసిన కవర్లను పంచి ఓట్లను అభ్యర్థించినట్లు ప్రజల్లో ప్రచారం జరుగుతోంది.అంతేకాక బ్రతుకుతెరువు నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లిన పలు వార్డులకు సంబంధించిన ఓటర్లను రప్పించేందుకు ముందుగానే వారికి ఫోన్ ల పే ద్వారా డ బ్బులను పంపిస్తున్నట్టు కూడా ప్రచారం జ రుగుతుంది. అభ్యర్థులు ప్రచార సమయం లో ఓటర్లకు ఉదయం టిఫిన్ మొదలు మ ధ్యాహ్నం భోజనం...
ప్రచార అనంతరం రా త్రి మద్యం పంపిణీకి భారీగా ఖర్చు చేస్తున్న ట్లు ప్రచారం జరుగుతోంది.దీంతో మున్సిపల్ ఎన్నికల్లో డబ్బు, మద్యం ఏరులై పారుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు,నిఘా వ్యవస్థ మాత్రం పట్టించుకోవడంలేదనే బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి.కట్టడి చే యాల్సిన అధికారులే ..ఆ వైపు కన్నెత్తే చూ డడం లేదని చర్చ జరుగుతుంది.
నిఘా వ్యవస్థ పూర్తిగా విఫలమైందని ప్రజలు భావిస్తున్నారు. అయితే ఎన్నికలు కీలక దశ చేరు కున్న తరుణంలో ఈ రెండు రోజులు పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన నిఘా వ్యవస్థ ఏర్పా టు చేసి కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు.ఇదిలా ఉండగా మాయదారి ఎలక్షన్ల పుణ్యమా అని ప్రతిరోజు తమ భర్తలు మ ద్యం తాగి వేళాపాళా లేకుండా అర్ధరాత్రి వేళ ల్లో ఇంటికి వెళ్తుండడంతో అనుకోకుండా జరగరాని ప్రమాదాలు జరిగితే తమ పరిస్థితి ఏంటని మహిళలు ఆందోళనకు గురవు తున్నట్లు తెలుస్తోంది.
ఈసీ నిబంధనలకు తూట్లు!
పుర ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎలక్షన్ కమీషన్ నిబంధనల మేరకు రూ. లక్షకు మించి ఖర్చు చేయరాదు.కానీ ఈసీ ని బంధనలకు తూట్లు పడేలా అభ్యర్థులు గెలు పే లక్ష్యంగా ఓటర్లను ప్రలోభ పెడుతూ...
ఒక్క రోజు మొత్తానికే రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈసి నిబంధనలకు విరుద్ధంగా అభ్యర్థులు వ్యవహరిస్తున్న తీరు స్పష్టమవుతుంది.అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో కట్టడి చేయాల్సిన బాధ్యత ఉందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.