calender_icon.png 9 February, 2026 | 1:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభ్యర్థులకు డబ్బుల పంపిణీకి ఏర్పాట్లు చేసుకుంటున్న వ్యాపారవేత్త

09-02-2026 12:00:00 AM

  1. అభద్రతా భావనలో అభ్యర్థులు 

అధికార పార్టీ అభ్యర్థులకు ఓడిపోతున్నామనే భయం

మందు సరఫరా చేస్తున్న పట్టించుకొని అధికార యంత్రాగం 

నారాయణపేట. ఫిబ్రవరి,8(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు, వ్యాపారవేత్త నేడు తనపార్టీకి చెందిన అభ్యర్థులకు మందు, నగదు ను ప్రతి అభ్యర్థికి పది లక్షల రూపాయలు నుండి ఇరువై లక్షల రూపాయలు నేడు రాత్రికి ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యం లో నామినేషన్ దాఖలు చేసిన నాటి నుండి నేటి వరకు అధికార పార్టీ అభ్యర్థులకు కనీసం పంప్లేట్లు, బ్యాలెట్ పేపర్లు ప్రచార సామాగ్రి కూడా పంపిణీ చేయలేని దుస్తితి నెలకొందని కొందరు పేరు చెప్పటానికి ఇష్టపడని నేతలు తెలిపారు.

ఇప్పటి వరకు కొం త మంది అభ్యర్థులు స్వంత డబ్బులు వెచ్చిం చి యువతకు విందులు, మందు పార్టీలు చేసినట్లు కొంత మంది నాయకులు వాపోయారు. ఈ క్రమంలోకొందరు అభ్యర్థులు కూడా ఆర్థికంగా ఉన్నవారు కావటంతో స్వంత డబ్బులు వెచ్చించి ప్రచారం చేస్తున్నారు. సదరు వ్యాపారవేత్త నేడు 20 మంది అభ్యర్థులకు మందుడబ్బులు నేడు పంపిణీ చేయటానికి ఏర్పాట్లు చేసుకొని నేడు అర్థరాత్రిలోగా పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది .

ఈ నేపథ్యంలో డబ్బులు, మం దు పార్టీలు చేస్తున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సదరు అభ్యర్థులపై నిఘా పె ట్టాల్సిన ఎన్నికల సంఘం అధికారులు, అధికార యంత్రాంగం విఫలమైనట్లు పలువురు చర్చించుకుంటున్నారు. 

ఇదిలా ఉండగా సదరు వ్యాపారవేత్త మాత్రం తన అనుచరులతో తన సతీమణి పోటీచేస్తున్న వార్డులో సైతం నగదు, గూగుల్ & ఫోన్ పే ద్వారా ఓటుకు 5000 నుండి 6000 రూపాయలు ఇవ్వటానికి గాను తన స్వంత అనుచరులను రంగం లోకి దించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం నగదు బదిలీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఓటర్లును ప్రలోభాలకు గురిచేస్తున్న సదరు వ్యాపారవేత్త పై ఎన్నికల సంఘం అధికారులు నగదు బదిలీ వ్యవహారంపై నిఘా ఏర్పాటు చేసి ప్రజాస్వామ్య యుతంగా ఎన్నికలు నిర్వహించాలని ప్రజ లు చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో సదరు వ్యాపారవేత్త పై నిఘా ఏర్పాటు చేసి ధనం, మందు విందు లను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.