దేవాలయం పక్కన మద్యం దుకాణాన్ని వెంటనే తొలగించాలి
–బీజేపీ నాయకులు తంబళ్ల రవి డిమాండ్
భక్తులకు, ప్రజలకు ఇబ్బందిగా మారిన మద్యం షాప్
దమ్మపేట,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని జీడిగింజల సెంటర్ లో ఉన్నటువంటి ఎంతో పవిత్రమైన నాగేంద్ర స్వామి దేవాలయం పక్కనే మద్యం షాప్ ఏర్పాటు చేశారని, దాన్ని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు తంబళ్ళ రవి డిమాండ్ చేశారు. నాగేంద్ర స్వామి దేవాలయం ప్రక్కనే మద్యం షాపు వలన మహిళా భక్తులకు, ప్రజలకు చాలా ఇబ్బంది గా ఉన్నదనీ, ఇప్పటికే పలుమార్లు అధికారులకు వైన్స్ షాప్ తొలగించాలని వినతి పత్రం సమర్పించామని, అయినా అధికారుల్లో స్పందనలేదనీ, దమ్మపేట పంచాయతీ నూతన కార్యదర్శి గా వచ్చిన బండి అనంత్ కుమార్ కు మరో సారి వినతి పత్రం ఇచ్చామని, ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు, భక్తులకు ఇబ్బందిగా ఉన్న మద్యం షాప్ ని తొలగించాలని, లేని యెడల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నిరహార దీక్ష కు చేపట్టవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నియోజకవర్గ నాయకులు తంబళ్ల రవి, సీనియర్ నాయకులు గూడా ముత్యాలరావు, పూచి ప్రసాద్, కారం రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.






