29 August, 2026 | 12:39 PM

Breaking News

ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపనకు భూమి పూజ   •   పెంజర్లలో అభివృద్ధి, పారిశుద్ధ్య పనులను పరిశీలించిన అదనపు కలెక్టర్   •   స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం   •   ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ నాయకులు   •   క్రీడలతో యువతలో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందుతుంది   •   మహానగరంలో గంజాయి చాక్లెట్ల కలకలం.. 5 వేలకు పైగా సీజ్   •   కుల గణన శాస్త్రీయంగా జరగాలి   •   మంత్రి పర్యటనకు చురుకుగా ఏర్పాట్లు   •   45వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‎ను ప్రారంభం   •   బాలల హక్కులపై అవగాహన.. ఇబ్బందులు ఉంటే ఫోన్ కాల్ తో పరిష్కారం   •  

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్

19-06-2026 09:44 PM

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించండి

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ రక్షణ సేన పార్టీని ఆదరించండని తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్ తెలిపారు. నాగిరెడ్డిపేట్ మండల కేంద్రంతో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో శుక్రవారం కార్యకర్తలతో నాయకులతో కలిసి జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్ టిఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలపై ఒంటి కాలితో టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు కవిత పోరాటం చేస్తుందని తెలిపారు. ఒక మహిళగా ఆమె తీసుకున్న నిర్ణయానికి ప్రజలు ఆదరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలంగాణ రాష్ట్ర సేన పార్టీని బలపరచాలని కోరారు. గత ప్రభుత్వంలో జరిగిన అవినీతిని టిఆర్ఎస్ పార్టీ ఎండగడుతుందని తెలిపారు.జరిగిన అవినీతిని బయటకు తీస్తూ ప్రజల ముందు ఉంచుతుందన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రక్షణ సేన పార్టీలో పలువురు నాయకులు, కార్యకర్తలు చేరారు.