19 June, 2026 | 11:01 PM

అంగన్వాడీ కేంద్రాల్లో ఉచిత విద్యుత్ సరఫరా ప్రారంభించిన ఎమ్మెల్యే

19-06-2026 10:00 PM

ఉట్నూర్,(విజయక్రాంతి): ఉట్నూర్ మండల కేంద్రంలోని లక్కారం, నవోదయ నగర్ లో ని అంగన్వాడి కేంద్రాలలో  ఉచిత విద్యుత్ సరఫరా  ను ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ప్రారంభించారు. శుక్రవారం సాయంకాలం ఉట్నూర్ మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాలకు  ప్రభుత్వం  తరపున ఉచిత  విద్యుత్ సరఫరాను  విద్యుత్ శాఖ ఎస్ ఈ శేషారావు రాథోడ్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్ష కాలంలో ఎదురయ్యే సమస్యల పైన చర్చించారు. పంట పొలాల్లో,గ్రామాల్లో గాలి వాన వల్ల ఎదురయ్యే ఇబ్బందుల వల్ల విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురువ్వకుండా చూడాలని సూచించారు. గాలి బీభత్సంతో తెగిపడిన విద్యుత్ వైర్లు,స్తంభాలను వెంటనే సరే చేసే చర్యలు చేపట్టాలి అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న ఉచిత 200 యూనిట్ల విద్యుత్ ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చూడాలన్నారు.

విద్యుత్ సౌకర్యం లేని చోట్ల ఇంటర్నల్ గ్రామాల్లో అంగన్వాడీ కేంద్రాలకు సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి సోలార్ ద్వారా విద్యుత్ సరఫరా సౌకర్యనికి కృషి చేస్తాం అన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని పిల్లలకు అందించే సరకులు,గుడ్ల నాణ్యతను పరిశీలించారు. ప్రభుత్వం పిల్లలకు అందించే పోష్టికాహారాన్ని క్రమం తప్పకుండా పిల్లలు,గర్భిణి స్త్రీలకు అందించాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు గ్రామస్తులుఉన్నారు.