19 June, 2026 | 11:12 PM

చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ

19-06-2026 09:34 PM

* చేనేత సంఘం సభ్యుల ఐక్యత, సంక్షేమమే ధ్యేయం

* నూతన అధ్యక్షులు : నాగుల సత్యనారాయణ

వేములవాడ,(విజయక్రాంతి): మార్కండేయ పద్మశాలి చేనేత సంఘం అధ్యక్షుడిగా (అడ్వకేట్) నాగుల సత్యనారాయణ ఎన్నికయ్యారు. తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన సంఘ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సంఘ అభివృద్ధి, చేనేత కార్మికుల సంక్షేమం, సభ్యుల ఐక్యత కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు. నాగుల సత్యనారాయణ నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధించాలని సభ్యులు, ప్రముఖులు ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.