ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్
మూడవ రోజు సవమై తేలాడు.
మద్యం సేవించి పథకం ప్రకారం హత్య.?
హత్యకు పాల్పడ్డ వారిపై అట్రాసిటీ హత్య కేసు నమోదు చేయాలి: ఎంఆర్పిఎస్
బోథ్,(విజయక్రాంతి): నేరడిగొండ మండలంలో ని పెద్ద బుగ్గారం గ్రామానికి చెందిన సురేష్ 25 అనే యువకుడు బుధవారం రాత్రి నుండి కనిపించకుండా పోయి శుక్రవారం ఉదయం బోత్ మండలంలోని కరత్వాడ చెరువులో చేరాడు. యువకుని మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని అంటున్నారు. నేరడిగొండ మండలంలోని కుమారి గ్రామానికి చెందిన ఓ యువతీతో ప్రేమ వ్యవహారం కొనసాగడం సదరు యువతిని ఇద్దరు యువకులు ప్రేమించడం వల్ల ఈ హత్య జరిగి ఉండవచ్చని అంటున్నారు. మృతి చెందిన యువకుడు నిర్మల్ నుండి బుధవారం రాత్రి తిరిగి వస్తుండగా ఆయన మిత్రుడు ఫోన్ చేసి మనం పార్టీ ఏర్పాటు చేసుకుందాం రమ్మని పిలవడంతో నేరుగా బోత్ కు వచ్చినట్లు పేర్కొంటున్నారు. అయితే ద్విచక్ర వాహనంపై వచ్చినవారు బోత్ బస్టాండ్ లో మద్యం తీసుకొని వెళ్ళినట్లు అక్కడి సిసి ఫుటేజీల ఆధారంగా నిర్ధారణ అయినట్లు పేర్కొంటున్నారు.
రెండు రోజుల క్రితం మిస్సింగ్
మృతి చెందిన యువకుడు బుధవారం రాత్రి నుండి కనిపించకుండా పోవడంతో మృతిని బంధువులు గురువారం నేరడిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. యువకుని కోసం కుటుంబీకులు వెతుకుతున్న సమయంలో కరత్వాడ చెరువులో శవమై తేలడంతో ఆయన బంధువర్గంలో ఆందోళన నెలకొంది. మృతుడు బుధవారం రాత్రి ఆయన సమీప బంధువులకు 10 గంటల 43 నిమిషాలకు ఫోన్ చేసి ఇక్కడ చెరువు దగ్గర ఉన్నాం మద్యం సేవిస్తూ ఉన్నారు ఏదో జరుగుతుందని ఆందోళనగా చెప్పినట్లు సమాచారం. వెంటనే సమాచారం అందుకున్న బంధువులు కరత్వాడ చెరువు వద్దకు 11 గంటల ప్రాంతంలో వచ్చి చూసేసరికి ఎవరు కూడా కనిపించలేదని అంటున్నారు.
శుక్రవారం చెరువులో శవమై తేలిన యువకుడు
శుక్రవారం ఉదయం పూట తర్వాత చెరువులో శవమై వెళ్లడంతో మృతునిది ప్రేమ హత్య నేనని బంధువులు పేర్కొన్నారు. అంతేగాక పథకం ప్రకారం హత్య చేశారని అంటున్నారు. చెరువు సమీపంలో మద్యం బాటిళ్లు కనిపించడంతోపాటు గంజాయి సేవించి మత్తులో ఈ దురాగతానికి ఒడిగట్టారని అంటున్నారు. ఈ సంఘటనలో దాదాపు ఆరుగురు మంది ముఠా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. బోత్ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడుని గురువారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు అంటున్నారు.
అట్రాసిటీ హత్య కేసు నమోదు చేయాలి.
యువకుడిని హత్య చేశారని ఇందులో బాధ్యులైన వారిపై అట్రాసిటీ కేసు తోపాటు హత్య కేసును నమోదు చేయాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా ప్రధాన కార్యదర్శి కుడాల స్వామి కారం రవీందర్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానిక సీఐ ఎస్ఐలకు విన్నవించారు. అంతేగాక ఈ కేసులో నేరడిగొండ ఎస్సై నిర్లక్ష్యంగా వ్యవహరించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు ఆరోపించారు ఈ విషయంలో జిల్లా ఉన్నతాధికారులు తగు విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలానికి ఏ ఎస్ పి ఐపీఎస్ రిత్విక్ సాయి కొట్టే చేరుకొని పరిస్థితిని గమనించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు భారీ బందోబస్తును నిర్వహించారు. కాగా నేరేడు కొండ మండలంలోని కుమారి గ్రామంలో ఉన్న యువతి తోపాటు ఆమె కుటుంబీకులను పోలీసులు విచారణ నిమిత్తం తీసుకువెళ్లినట్లు తెలిసింది. ఏది ఏమైనా ప్రేమ వ్యవహారం హత్యకు దారి తీసింది అని తెలియడంతో భారీ సంఖ్యలో ప్రజలు సంఘటన స్థలానికి చేరుకొని బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.






