2 July, 2026 | 5:10 PM

Breaking News

ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్ అంకిత్   •   పారిశుధ్యం అప్రమత్తంగా ఉండాలి   •   పరిసరాల పరిశుభ్రత ప్రతీ ఒక్కరు పాటించాలి: ఉప సర్పంచ్ ఆంగోతు శ్రీనివాసరావు   •   దొంగతనానికి పాల్పడిన వ్యక్తులపై కేసు నమోదు   •   చర్చలకు పిలిచి అరెస్ట్ చేయించడం సిగ్గుచేటు   •   వైద్యులు తమ వృత్తిని సేవా భావంతో నిర్వహించాలి   •   పర్మిట్ రూమ్‌లో షాకింగ్ ఘటన.. వేయించిన పల్లీల్లో బొద్దింక   •   పోలీస్ సిబ్బందికి రివార్డులు   •   ఐక్య పోరాటాలతోనే సమస్యలు పరిష్కారం   •   ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •  

సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబుకు ఉత్తమ ప్రశంసా పత్రం

17-05-2025 01:10 AM

తొర్రూరు,  మే 16: తెలంగాణ రాష్ట్ర భాష, సంస్కృతిక శాఖ, భవాని సాహిత్య వేదిక ఆధ్వర్యంలో రూపొందించిన పహల్గాం కవితల సంకలనం పుస్తకావిష్కరణ హైదరాబాదులోని రవీంద్రభారతిలో శుక్రవారం జరిగింది. ఇందులో ఎంపిక చేసిన కవితల్లో తొర్రూరు డివిజన్ చెందిన సాహితీ వేత్త ఇమ్మడి రాంబాబు రచించిన ‘ఐక్యతను చాటుదాం ఉగ్రవాదని తుదముట్టిద్దాం’ ఉత్తమ కవితగా ప్రకటించారు.

నిర్వాహకులు డాక్టర్ వైరాగ్యం ప్రభాకర్ రావు, హైదరాబాద్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వాధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి నామోజీ వీరాచారి, బాల సాహితీవేత్త గద్వాల సోమన్న, వీత్రీ ఛానల్, విశ్వంభర పత్రిక సంపాదకులు డాక్టర్ కాచం సత్యనారాయణ  రచయితల మీదుగా సన్మానించి, ప్రశంస పత్రం అందజేశారు.