calender_icon.png 23 August, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డెంగ్యూ నివారణకు శుభ్రత పాటించాలి

17-05-2025 01:10:05 AM

-డిప్యూటీ డీఎంహెచ్‌ఓ  డాక్టర్ బ్రిజున్నీసా

మలక్‌పేట్, మే 16 (విజయ క్రాంతి): డెంగ్యూ నివారణ కోసం దోమలు వృద్ధి చెందకుండా తగిన జాగ్రత్తలను తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బ్రిజున్నీ సా అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మలక్‌పేట్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ సందర్భంగాడిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ బ్రిజున్నీసా మాట్లాడుతూ  ఇంటి చుట్టుపక్కల మురుగునీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలని  సూచించారు.నీటిని నిల్వ చేసే పాత్రలను శుభ్రపరచి వాటిపై మూతలు పెట్టాలని తెలిపారు. దోమల నియంత్రణ మందులు, దోమ తెరలు ఉపయోగించాలన్నారు. దోమకాటు బారిన పడకుండా పొడుగు దుస్తులను ధరించాలన్నారు..  ఈ కార్యక్రమంలో ఏక్తా జనశక్తి ఫౌండేషన్ అధ్యక్షుడు రాజేష్ యాదవ్, సిబ్బంది రామేశ్వరి, మల్లికార్జున రెడ్డి, నీలిమ, జయ, కవిత ఆశా వర్కర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.