calender_icon.png 17 May, 2025 | 6:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హజ్ యాత్రతో శాంతి, సంతోషం

17-05-2025 01:09:31 AM

  1. ముస్లింలకు 25 వేల రాజీవ్ యువ వికాసం యూనిట్లు
  2. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
  3. తెలంగాణ నుంచి హజ్ యాత్రకు 4,200 మంది
  4. బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సీఎం 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): హజ్ యాత్రకు వెళ్తున్న యాత్రికుల బస్సులను నాంపల్లిలోని హజ్‌హౌస్‌లో శుక్రవా రం జెండా ఊపి సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హజ్ యాత్రి కులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ పవిత్ర యాత్ర వారి జీవితంలో అధ్యాత్మిక శాంతిని, సంతోషాన్ని తీసుకురావాలని ఆకాంక్షించారు.

2025 హజ్ యాత్ర కోసం తెలంగాణ నుంచి సుమారు 4,200 మంది యాత్రికులు ఎంబార్కేషన్ పాయింట్ హైదరాబాద్ ద్వారా సౌదీ అరేబియాకు బయ లుదేరుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపా రు. వీరంతా జూన్ 10 నుంచి జూలై 10 మ ధ్య మక్కా, మదీనాలో హజ్ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

రాజీవ్ యువవికాసం దరఖాస్తుల్లో మైనారిటీలకు ప్రాధా న్యం ఇస్తున్నామని, ముస్లింలకు 25 వేల యూనిట్లు మంజూరు చేస్తామన్నారు. ముస్లిం మైనారిటీల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మైనారిటీల కోసం రూ.580 కోట్లు కేటాయించా మని చెప్పారు.  ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఓవైసీ, అనిల్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. 

పాకిస్థాన్ బుద్ధిని మార్చాలని కోరండి: అసదుద్దీన్ ఓవైసీ

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో నాంపల్లి హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ వాళ్ల బుద్ధి కుక్కతోక వంకరలా ఉన్నదని, సమయం వచ్చినప్పుడు పాకిస్థాన్ వక్రబుద్ధిని తప్పకుండా మారుస్తామన్నారు. హజ్ యాత్రకు వెళ్లే వారంతా పాకిస్థాన్ బుద్ధిని మార్చాలని ఆ దేవుడిని కోరాలని విజ్ఞప్తి చేశారు.