25 February, 2026 | 2:03 AM

స్నేహిత హిల్స్‌లో సమస్యలతో సహజీవనం

25-02-2026 12:25 AM
  1. మంచి నీరు లేదు..బోరు వాటారే దిక్కు
  2. రోడ్డు ఉన్న అడుగుకు ఓ గుంత.. వర్షం వచ్చిందంటే అంతే గతి
  3. ప్రతి ఏటా కోట్ల రూపాయల  పన్నులు చెల్లిస్తున్న పాలకులకు. అధికారులకు పట్టని అభివృద్ధి
  4. రాజ్యమేలుతున్న నిర్లక్ష్యం

రాజేంద్రనగర్ ఫిబ్రవరి 24 (విజయక్రాంతి) : రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కాలనీలో ఒకటి అయిన స్నేహిత హిల్స్‌లో కాలనీ వాసులు సమస్యలతో సహజీవనం చేస్తున్నారు.. ప్రతి సంవత్సరం రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా కోట్ల కొద్ది రూపాయలను పన్నుల రూపంలో ప్రభుత్వానికి  చెల్లిస్తున్న కాలనీవాసులకు కనీస సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు..

కాలనీ వా సులను మంచినీటి సమస్య తీవ్రంగా వేధిస్తుంది స్నేహిత హిల్స్ సొసైటీ పరిధిలోని భూమిలో మెట్రోపాలిటన్ వాటర్ సప్లై. సేవరేజ్ బోర్డు వారు నిర్మించిన 300 కే ఎల్ ఆర్ వాటర్ ట్యాంక్ వల్ల కాలనీవాసులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుంది .స్నేహిత హిల్స్ లో వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ సంబంధిత వాటర్ ట్యాంక్ నుండి ఫిబిల్ సిటీకి మాత్రమే మంచినీరు అందుతుంది.

స్నేహిత హిల్స్‌లో కాలనీలకు డిస్ట్రి బ్యూటర్ పైపులైన్ ఉన్నప్పటికీ కొన్ని టెక్నికల్ సమస్యలతో  మంచినీటిని అధికారులు వదలడం లేదు.. ఇక రోడ్డు విషయానికి వస్తే బ్రాడ్ వే హోటల్. రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూం పక్కనుండి ఉన్న మట్టి రోడ్డు పూర్తి గా గుంతల మయం అయింది వర్షం వచ్చిందంటే ఇక సమస్యను చెప్పడం కష్టం ఒక్కో  అడుగుకు ఒక గుంత.. ఎంతోమంది ద్విచక్ర వాహనదారులు కిందపడి గాయాల పాలు అయిన సంఘటనలు ఉన్నాయి.

ప్రతి సంవత్సరం భారీ అపార్ట్‌మెంట్‌లలో విల్లాలు కొనుగోలు చేస్తున్న యజమానులు కోట్ల కొద్ది రూపాయలు రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ప్రభుత్వానికి చెల్లిస్తున్నప్పటికీ స్నేహి తహిల్స్ లో సమస్యలు మాత్రం ఎవరికీ పట్టడం లేదు. అత్యంత వేగంగా దినదిన అభివృద్ధి చెందుతున్న స్నేహిత హిల్స్ లో రోడ్లు డ్రైనేజీలు తాగునీటి సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పిస్తే మరింతగా కాలనీ అభివృద్ధి చెంది మంచి గుర్తింపు పొంది అభివృద్ధి చెందిన కాలనీగా తయారు కానున్నదని  కాలనీవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కాలనీలో భూగర్భ 11 కె.వి విద్యుత్ వైర్లు ఉండటం వల్ల కాలనీ వాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు నివాస గృహాల మధ్యనే విద్యుత్ సబ్ స్టేషన్ ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు ఏప్పుడు ఏ ప్రమాదం సంభవిస్తుందో నని భయాందోళనకు గురి అవుతున్నారు..

సమస్యల గురించి ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌కు విజ్ఞప్తి చేశాం

స్నేహితహిల్స్‌లో ఉన్న పలు సమస్యలపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కు గతం లో వినతి పత్రం ఇవ్వడం జరిగిందని కాలానికి చెందిన మాధవి రెడ్డి .విజయలక్ష్మి తెలిపారు. రెండు నెలల్లో సి సి రోడ్డు వేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని వారు పేర్కొన్నారు. స్నేహిత హిల్స్‌లో కుక్కలను పట్టి  అధికారులు ఇక్కడి నుండి తరలించాలని. కాలనీలో అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లాలని వారు విజ్ఞప్తి చేశారు.

       మాధవి రెడ్డి, విజయలక్ష్మి