25 February, 2026 | 2:01 AM

కూడలిలో ఇసుక డంప్‌ల సీజ్

25-02-2026 12:26 AM

మోతె, ఫిబ్రవరి 24: అనుమతి లేకుండా ఇసుక రవాణాతో పాటు కూడలిలో అక్రమంగా నిలువచేసిన ఇసుక డంపులపై విజయక్రాంతి మంగళవారం ఇసుకాసుర కూడలి అనే శీర్షికన రాసిన కథనానికి అధికారులలో స్పందన వచ్చింది. మంగళవారం ఉదయం కూడలిలో ఉన్నటువంటి ఇసుక డంపుల మీద రెవిన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిలువ చేసినటువంటి ఆ డంపులను గుర్తించి 17 డంపులను అధికారులు సీజ్ చేశారు.

ఈ డంప్ లలో ఇసుక సుమారు 202 ట్రక్కులు అవుతాయని అధికారులు తెలిపారు. రెవిన్యూ ఇన్స్పెక్టర్ కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ తాసిల్దార్ వెంకన్న ఆదేశాల మేరకు దాడులు చేయగా 17 చోట్ల అక్రమంగా నిలువ చేశాతన్నారు. దీంతో వాటిని సీజ్ చేశామన్నారు. ఎవరైనా అనుమతులు లేకుండా ఇసుకను రవాణా చేసిన, అక్రమంగా నిలువ చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఇసుక విషయంలో అవినీతి జరిగితే సహించే ప్రసక్తే లేదన్నారు.