10 March, 2026 | 3:12 AM

మహిళా సంఘాల సభ్యులు రుణాలు

10-03-2026 01:13 AM

సకాలంలో చెల్లించాలి

గాంధారి, మార్చి 9 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరల్ తండాలో మహిళా సంఘాల సభ్యుల రుణాల రికవరీ కొరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులు సకాలంలో తీసుకున్న రుణాలు చెల్లించాలని డి.ఆర్.డి.ఎ. ఏపీడీ విజయ లక్ష్మీ అన్నారు. ఈ సందర్భంగా ఐకెపి సిబ్బందితో కలిసి తండాలో రుణాలు చెల్లించని సభ్యుల ఇంటికి వెళ్లి పెండింగ్ రుణాలు చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలోడీపీఎం రాజయ్య, ఏపీఎం ప్రసన్న కుమార్, సీసీ లు రాములు, రాజయ్య,, శేఖర్,నేరల్ తండా సర్పంచ్ రవీందర్, ఉప సర్పంచ్ నెహ్రూ, విఓఎ లు గౌస్ ఖాన్, విక్రమ్, గోపాల్, ప్రభావతి, లక్ష్మీ దేవి, స్వప్న,సవిత,రోజా పద్మ , గ్రామ  సంఘం అధ్యక్షురాలు లక్ష్మీ పాల్గొన్నారు..