10 March, 2026 | 2:36 AM

పాఠశాలలో కొట్టుకున్న ఉపాధ్యాయులు..

10-03-2026 01:10 AM

ఇద్దరు ఉపాధ్యాయులపై కేసు నమోదు..

బాన్సువాడ, మార్చి 9 (విజయ క్రాంతి):  విద్యార్థులకు విద్యాబుద్ధులు అందించాల్సిన ఉపాధ్యాయులు బాధ్యతారాహిత్యంగా పాఠశాలలోనే రక్తం వచ్చేదాకా కొట్టుకున్న ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం బొమ్మన్ దేవ్ పల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్ లో చోటు చేసుకుంది.

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న  ఉపాధ్యాయులు పాఠశాలలో ప్రొసీడింగ్స్  విషయంలో వ్యక్తిగత కారణాలతో ఉపాధ్యాయులు సమావేశంలో నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్ లు ఘర్షణకు దిగారని ఎస్.ఐ. రాఘవేంద్ర తెలిపారు.

రామోజీ శ్రీనివాస్ కు ముక్కు పై బలమైన గాయం అయి రక్తం కారడంతో చికిత్స నిమిత్తం నసురుల్లాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొంది, మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే బాధిత ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ తనకు కొట్టిన నంద్యాల శ్రీనివాస్, హెడ్ మాస్టర్ ఆనంద్ ఫోన్ తీసుకుని ఫిర్యాదు ఇవ్వకుండా అడ్డుకున్నాడని పోలీస్ స్టేషన్ లో ఇద్దరి పై ఫిర్యాదు చేశాడు. ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్, హెడ్ మాస్టర్ ఆనంద్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. రాఘవేంద్ర తెలిపారు.