ఆరు గ్యారెంటీ మరచిన కాంగ్రెస్ ప్రభుత్వం
కొత్తపల్లి,(విజయక్రాంతి): అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ముఖ్యంగా ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రజలను నమ్మించి మోసం చేసిందని, కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారెంటీల గారడి ప్రజలందరికీ అర్థమైందని, ఆరు గ్యారంటీలు పెద్ద బోగస్ అని బిజెపి మండల అధ్యక్షుడు కుంట తిరుపతి విమర్శించారు.
బిజెపి రాష్ట్ర శాఖ పిలుపుమేరకు సోమవారం రోజున బిజెపి కొత్తపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టి, తహసిల్దార్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఉపాధ్యక్షులు రంగు భాస్కరాచారి మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీ ల పేరిట ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు. రెండున్నర ఏళ్లయిన ఆరు గ్యారంటీలను అమలు చేయలేని దౌర్భాగ్య పరిస్థితిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఆరూ గ్యారంటీలు చేతకాకపోతే వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలని డిమాండ్ చేశారు.




