16 March, 2026 | 6:00 PM

జిల్లా అడ్మినిస్ట్రేషన్ – ట్రెజరరీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

16-03-2026 04:51 PM

ఆర్యోగంగా ఉన్న ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలి - కలెక్టర్

హనుమకొండ,(విజయక్రాంతి): హనుమకొండ కలెక్టరేట్ లోని జిల్లా ఖజానా శాఖ కార్యాల ప్రాంగణంలో సోమవారం జిల్లా ఖజానా శాఖ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులను కాపాడేందుకు రక్తదాన శిభిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరానికి ముఖ్య అతిధిగా హనుమకొండ జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు చాహత్ బాజ్ పాయ్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ... ఈ గొప్ప సేవా కార్యక్రమమైన రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన జిల్లా పరిపాలనకు  అభినందనలు తెలిపారు.

ఒక యూనిట్ రక్తం అనేక అమూల్యమైన ప్రాణాలను కాపాడగలదనీ, ప్రత్యేకంగా వేసవి కాలంలో రక్త బ్యాంకుల్లో రక్తం కొరత ఎక్కువగా ఉంటుందనీ,అదే సమయంలో అనేక మంది రోగులు నిరంతరం రక్తంపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. ముఖ్యంగా తలసేమియా,సికిల్ సెల్ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆరోగ్యంగా జీవించడానికి తరచూ రక్త మార్పిడి అవసరం అవుతుందనీ వారికి రక్తం అనేది కేవలం అవసరం మాత్రమే కాదు,అది నిజంగా వారి ప్రాణాధారం అన్నారు.

ఈ సందర్భంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాలు నిర్వహించడం, ప్రజల్లో అవగాహన కల్పించడం మరియు అవసరమైన వారికి సమయానికి రక్తం అందేలా చూడడంలో ఎంతో ముఖ్యమైన మరియు ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది. రెడ్ క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవ నిజంగా మానవతా సేవగా నిలుస్తోందన్నారు. రక్తదానం పూర్తిగా సురక్షితమైనది, సులభమైనదని,మనం ఎవరో ఒకరి ప్రాణాన్ని కాపాడుతున్నామనే ఆనందం అపారమైన తృప్తిని ఇస్తుంది. కాబట్టి మనమంతా కలిసి రక్తదానంపై అవగాహన పెంచుతూ, ఎక్కువ మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా ప్రోత్సహిద్దాంఅన్నారు.

ఈ రక్తదాన శిబిరంలో హనుమకొండ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈవి శ్రీనివాస్ రావు, జిల్లా పాలకవర్గ సభ్యులు  పుల్లూరు వేణుగోపాల్, బిళ్ళ రమణారెడ్డి, జిల్లా ఖజానా శాఖ అధికారి అకవారం శ్రీనివాస్ కుమార్, టీఎన్జీఓ ప్రెసిడెంట్ ఆకుల రాజేందర్, టీజీఓ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్ మోహన్ రావు, ఉద్యోగ సంఘ నేతలు బైరి సోమయ్య, డా.ప్రవీణ్, రామకృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, కోలా రాజేష్ కుమార్, మాధవ రెడ్డి, లక్ష్మి ప్రసాద్, విజయలక్ష్మి, కిరణ్, శ్యామ్ సుందర్, ఫణికల రాజేష్, ఎంఆర్ఓలు  బావు సింగ్, జగన్ మోహన్ రెడ్డి, ఖజానా శాఖ సిబ్బంది శ్రీనివాస్ రెడ్డి, అన్వర్, చంద్ర శేఖర్, దయాకర్, ప్రసాద్, ఉదయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.