27 March, 2026 | 3:06 PM

బీసీ కులగణన చేశాకే ‘స్థానిక’ ఎన్నికలు

17-05-2024 12:36 AM

బీఆర్‌ఎస్ నేత దాసోజు 

హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): కులగణన పూర్తి చేసిన తరు వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని, లేనిపక్షంలో బీసీలను రాజకీయ బానిసలుగా అణగదొక్కినట్టేనని బీఆర్‌ఎస్ నేత దాసోజ్ శ్రవణ్ పేర్కొన్నారు. జూన్ మొదట్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండాయని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినట్టు మీడియాలో ప్రచారం కావడంతో శ్రవణ్ స్పందించారు. బీసీలలో ఉన్న 113 సబ్బండ కులాలకు సమన్యాయం జరగాలంటే కులగణన వెంటనే పూర్తి చేసి, కర్ణాటక తరహాలో బిసీ వర్గీకరణ చేసి, ఎన్నికల నిర్వహించాలని గురువారం ‘ఎక్స్’ ఖాతాలో సీఎం రేవంత్‌కు సూచించారు. లేనిపక్షంలో బీసీలను కేవలం ఓట్లేసే యంత్రాలుగా దిగజార్చి, రాజకీయ బానిసలుగా అణగదొక్కినవా రిగా అపవాదం ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు.