అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోతోంది
చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆర్‌ఎస్ ప్రవీణ్ ఫిర్యాదు
హైదరాబాద్, మే 16 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ కార్యకర్తలపై నాగర్ కర్నూల్ జిల్లాలో పోలీసుల సమక్షంలోనే పట్టపగలు దాడులు జరుగుతు న్నాయని, అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని ఆ పార్టీ నేత ఆర్ ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసైగలతోనే జరుగుతోందని, మొన్నటి ఎన్నికల్లో తెలంగాణలో ఎక్కడా దాడులు జరగలేదని, సీఎం సొంత జిల్లాలో జరగడం చూస్తూంటే శాంతిభద్రలు కాపాడటంలో విఫలమైయ్యారని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్‌రెడ్డిలకు ప్రాణహాని ఉంద ని పేర్కొన్నారు. గురువారం అచ్చంపేటలో జరిగిన దాడులకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డీజీపీ రవిగుప్తాను గురువారం కలిసి ఫిర్యాదుచేశారు. అనంతరం మాట్లాడుతూ.. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, దాడిలో గాయపడ్డ బాధితులు ఫిర్యాదు చేస్తే పట్టించుకునే నాథుడే లేడని, గువ్వల బాల రాజుకు రక్షణ కల్పించాలని కోరారు.




