27 March, 2026 | 3:32 PM

బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు

27-03-2026 01:37 PM

ఆలేరు(విజయక్రాంతి): బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు, జిల్లా కేంద్రం భువనగిరి తారకరామ్ నగర్ లో గురువారం సాయంత్రం ఓ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. నాలుగేళ్ల చిన్నారి సందెల ప్రియాంష్ సాయంత్రం ఇంటిబయట ఆడుకుంటున్న సమయంలో బాలుడిపై ఓ వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. కుక్క దాడిలో బాబు కనుగుడ్డు బయటపడింది. ముఖంపై గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రులు వెంటనే బాబును భువనగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు, పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఇకనైనా అధికారులు స్పందించి ఇలాంటి ఘటనలు పునారావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, మున్సిపాలిటీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.