13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

భద్రాచలం ఆలయ అభివృద్ధి పనులకు సీఎం భూమిపూజ

27-03-2026 02:29 PM

హైదరాబాద్: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శుక్రవారం శంకుస్థాపన చేశారు. తొలి విడతలో రూ. 351 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆలయ విస్తరణకు సంబంధించిన పనులలో రూ. 75 కోట్ల వ్యయంతో గోదావరి ఘాట్ అభివృద్ధి, రూ. 180 కోట్ల వ్యయంతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, అలాగే రూ. 96 కోట్ల వ్యయంతో ఆలయ పరిసరాల అభివృద్ధి పనులున్నాయి.

ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka), మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా భద్రాచలంలోని మిథిల స్టేడియంలో జరిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవంలో, ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాలను సమర్పించి, ఆ దివ్య కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు.