30 June, 2026 | 8:36 PM

Breaking News

రైతు భరోసా నిధుల విడుదల లైవ్ స్ట్రీమింగ్   •   వీధి వ్యాపారుల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ లక్ష్యం   •   క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి ఆకు పూజ   •   కబడ్డీ క్లబ్‌లు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దాలి   •   నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి   •   ఉమ్మడి జిల్లా తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఇన్‌చార్జిగా పస్క నర్సయ్య నియామకం   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య   •   రోడ్డు ప్రమాదాల నివారణకు 3 డి రేడియం పోలీస్ వాహనాల ఏర్పాటు   •   రిటైర్డ్ పోలీసుల సేవలు మరువలేం   •   సింగరేణి అధికారుల పీఆర్పీ నిలుపుదలను వెంటనే ఎత్తివేయాలి: జనక్ ప్రసాద్ సంఘీభావం   •  

లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి

11-06-2025 12:25 AM

రంగారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ 

ఎల్బీనగర్, జూన్ 10: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జూన్ 14న (రెండవ శనివారం) రంగారెడ్డి జిల్లా లోని అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కర్ణ కుమార్ తెలిపారు. మంగళవారం ఎల్బీనగర్ లోని రంగారెడ్డి జిల్లా కోర్టులో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కక్షిదారులందరూ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

రంగారెడ్డి జిల్లాలో మొత్తం లక్షా పదిహేడు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయని చెప్పారు. ఇప్పటి వరకు కోర్టు ముందుకు రాని కేసులు, కోర్టులో పెండింగ్ లో ఉన్న కేసులు, పరిష్కరించు కునే లేదా రాజీ చేసుకునే కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు.

న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్న కేసులు లోక్ అదాలత్ లో పరిష్కరిస్తే, కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము తిరిగి చెల్లిస్తారని చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, డబ్బు వృథా కాకుండా ఉంటుందన్నారు.

జాతీయ లోక్ అదాలత్ లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, కుటుంబ తగాదా కేసులు, డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు, మోటర్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు, చిట్ ఫండ్ కేసులు, ఎలక్ట్రిసిటీ కేసులు, చెక్కు బౌన్స్ కేసులు, రాజీకి వీలున్న కేసులు పరిష్కరించుకోవచ్చు అని తెలిపారు. సమావేశంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి శ్రీవాణిపాల్గొన్నారు.